BREAKING
కుల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం.. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం దేశానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో స్కౌట్ మాస్టర్,గైడ్ క్యాప్టెన్ కూడా సైనికుడిగా తయారు చేయాలి ---మెదక్ జిల్లా విద్యాధికారి రాజు 'హే కన్నమ్మ' టీజర్ రిలీజ్.. ప్రేమకథతో ఆకట్టుకుంటున్న యశ్వంత్, ధనశ్రీ వర్మ! ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెన్సన్ హువాంగ్ శకం ముగిసిన తర్వాత ఎన్విడియా తొలి సమావేశం గ్లోబల్ ఈక్విటీలపై మోర్గాన్ స్టాన్లీ సానుకూల దృక్పథం ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ భారీ ఊరట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 'ది మేజ్' ట్రైలర్ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ అవుతుందన్న రాహుల్ రవీంద్రన్! జర్మనీలో ఇంధన భారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగు మొక్కల నాటడంపై రైతులకు అవగాహన ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన మలక వేమల సర్పంచ్ స్థానానికి నామినేషన్ సమర్పిస్తున్న సుభాషిని

ప్రచారంలో జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి బుల్లి రెడ్డి.

Select Suryaa Now
ప్రచారంలో జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి బుల్లి రెడ్డి.

                                           కుతుకులూరులో రసవత్తరంగా మారిన పంచాయతీ పోరు.. 
అనపర్తి మేజర్ న్యూస్. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పులగం బుల్లి రెడ్డి తన ప్రచారంలో జోరు పెంచారు. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందించిన నేపథ్యం బుల్లి రెడ్డికి ప్రధాన బలంగా మారుతున్నాయి.ప్రజలతో నిత్యం మమేకమై ఉంటూ, కష్టసుఖాల్లో వారికి అందుబాటులో ఉండటం, తన పరిధిలో అనేక మందికి సహాయ సహకారాలు అందించడం ఆయనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని అనుచరులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత పరిచయాలు, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఎన్నికల ప్రచారంలో ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.మరోవైపు గ్రామంలోని యువతలో గణనీయమైన సంఖ్యలో బుల్లి రెడ్డికి మద్దతుగా నిలుస్తుండటం, పలువురు గ్రామ పెద్దలు ఆయనకు అండగా నిలవడం ప్రచారానికి మరింత ఊపునిస్తోంది. పులగం కుటుంబానికి చెందిన వంశీయులు, బంధుమిత్రులు సైతం ఆయన విజయమే లక్ష్యంగా పనిచేస్తుండటంతో ప్రచార బలం పెరుగుతోంది. అంగబలం, అర్థబలంతో పాటు గ్రామస్థాయిలో ఉన్న పరిచయాలు, అనుచరగణం ఆయనకు అదనపు బలంగా మారుతున్నాయి.ప్రచారంలో భాగంగా బుల్లి రెడ్డి గ్రామస్థులను నేరుగా కలుసుకుంటూ, గ్రామ సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో చేసిన సేవలను గుర్తుచేస్తూ మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో కుతుకులూరులో కూటమి అభ్యర్థి ప్రచారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.గతంలో ప్రజలకు చేసిన సేవలు, అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం, గ్రామంలో ఉన్న మంచి పేరు తన విజయానికి పునాది అవుతాయని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కుతుకులూరు సర్పంచ్ ఎన్నికల్లో బుల్లి రెడ్డికి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కూటమి శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.