సర్పంచ్ అభ్యర్థుల ఖరారుపై జక్కంపూడి రాజా సమీక్ష
పాత తుంగపాడు సర్పంచ్ అభ్యర్థిగా అత్తిలి నాగమణి ఎంపిక
పుణ్యక్షేత్రం అభ్యర్థిగా పినికి రామలక్ష్మి ఖరారు
రాజానగరం మేజర్ న్యూస్,:తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం మండలంలోని పాత తుంగపాడు, పుణ్యక్షేత్రం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పాత తుంగపాడు గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా అత్తిలి నాగమణిని, పుణ్యక్షేత్రం గ్రామానికి పినికి రామలక్ష్మిని ఎంపిక చేసినట్లు జక్కంపూడి రాజా వెల్లడించారు.
ఈ సమావేశంలో పుణ్యక్షేత్రం మాజీ సర్పంచ్ పెంటకర్ల రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ లంక మాసరావు, కోనే మురళి, శ్రీనివాస్, వేపకాయల రాంబాబు, పినికి పాపారావు, వినికి చక్రరావు తదితరులు పాల్గొన్నారు.