BREAKING
టైసన్ ఫుడ్స్ ఊహించని షాక్ అక్షయ్ కుమార్ 'సముక్' మోషన్ పోస్టర్ రిలీజ్.. భయానక జీవితో పోరాటం, రిలీజ్ ఎప్పుడంటే? చెన్నాముక్కపల్లి సర్పంచ్ గా  కిరణ్ కుమార్ నామినేషన్ అజిత్ పవార్ పనితీరు భవిష్యత్ నాయకులకు ఒక విశ్వవిద్యాలయం 'యోగి కీ పాటి' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల మద్దతుతో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్ భీమవరంలో జనసేన పార్టీకి షాక్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరిక . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుండం కృష్ణారెడ్డి ఎంపిక ఎన్టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. పటిష్ట ఏర్పాట్లు అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్రపై భారత్ తీవ్ర ఆందోళన బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఎట్టకేలకు 'వారణాసి' అప్‌డేట్.. అసలైన బ్లాస్ట్ ఎప్పుడంటే? ఫిలిప్పీన్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ప్రవాస భారతీయులు విద్యార్థునుల ఆరోగ్య భద్రతే లక్ష్యం.. దుబ్బాక నియోజకవర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గుజరాత్‌లోని వద్‌నగర్‌లో విశ్వశాంతి మహాయజ్ఞం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత ప్రచారం కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ తదితరులు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి జిల్లాల్లో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, ఏర్పాట్లపై మంత్రి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డిసెంబర్ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవాలు చేపట్టాలని, పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి ఏర్పాటును ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా ప్రాధాన్యతను తెలియజేస్తూ వార్తాపత్రికల్లో ప్రత్యేక కథనాలు ప్రచురించేలా చూడాలని సూచించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గురుకుల పాఠశాల, విద్యాసంస్థకు ఖేలో ఇండియా కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో టార్చ్‌లైట్ ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునేలా ఈ కార్యక్రమం దోహదపడాలని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ సంస్థల నుంచి 6,000 మందికి పైగా యువ క్రీడాకారులు, 1,800 మంది సహాయక సిబ్బంది ఈ క్రీడా సంబరాల్లో పాల్గొననున్నారని తెలిపారు. మొత్తం 29 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా క్రీడా శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.