విద్యార్థునుల ఆరోగ్య భద్రతే లక్ష్యం..
విద్యార్థుల ఆరోగ్య భద్రతే లక్ష్యం:
అంబేద్కర్ గురుకులంలో దోమతెరల పంపిణీ..
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
హిందూపురం ఆటోనగర్ సమీపంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా ఈ పంపిణీ చేపట్టినట్లు వైద్యాధికారిణి డా. ఉషారాణి తెలిపారు. దోమతెరల వాడకంతో విద్యార్థులకు ప్రశాంత నిద్ర, చదువులో ఏకాగ్రత పెరుగుతుందని సత్యసాయి జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మినాయక్ తెలిపారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రిన్సిపాల్ నాగమణి సూచించారు. అనంతరం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శివన్న పలు సూచనలు విద్యార్థునులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర నాయుడు, ముస్తఫా, భాస్కర్, తిమ్మక్క, పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ నాగరాజు, హిందూపురం