ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకే కేటాయించాలి
మంచాల, మేజర్ న్యూస్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించాలని టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి చక్రపాణి కోరారు. నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను కేటాయించాలని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సూచించారు. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పథకం ద్వారా సొంతింటి కల నెరవేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల