BREAKING
కార్పొరేట్ రంగంలో కొత్త నిబంధనల భారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి యుద్ధ వాతావరణం నీడలో సౌదీ అరేబియా 'విజన్ 2030' భవిష్యత్ ఎల్ నినో ప్రభావం పై రైతులకు శిక్షణ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలు మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం

లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు

Select Suryaa Now
లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలంలోని మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆదివారం నిజామాబాద్ మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రత్యేకంగా సందర్శించారు. 2024 నవంబర్ వరకు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆయన పాఠశాల గ్రంథాలయంలో కొంతసేపు గడిపి, అక్కడ అందుబాటులో ఉన్న వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ గ్రంథాలయం ప్రత్యేకమైనదని, దానిని విజయవంతంగా నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయమని తన అభిప్రాయాన్ని సందర్శకుల రిజిస్టర్‌లో నమోదు చేశారు.
గ్రంథాలయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న దాత అల్లాపుల్ల గంగారెడ్డితో పాటు ఇతర దాతలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. భవిష్యత్తులో పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం మాజీ డి ఈ ఓ ఎన్.వి. దుర్గాప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో ఆనందాన్ని నింపింది.