BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

కావలిలో వేడెక్కిన మున్సిపల్ రాజకీయం.. పోటాపోటీగా చైర్‌పర్సన్ అభ్యర్థుల నామినేషన్లు.

Select Suryaa Now
కావలిలో వేడెక్కిన మున్సిపల్ రాజకీయం.. పోటాపోటీగా చైర్‌పర్సన్ అభ్యర్థుల నామినేషన్లు.

​కావలి, మేజర్ న్యూస్ :    కావలి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
​బరిలో ప్రధాన అభ్యర్థులు వీరే..
కూటమి ప్రభుత్వం తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా బీజేపీ నేత గుండ్లపల్లి భరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్ వేశారు.
​అభ్యర్థుల నేపథ్యం, రాజకీయ విశ్లేషణలు:
​కూటమి అభ్యర్థి: కావలి మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ (ఓసీ) కేటగిరీకి రిజర్వ్ కావడంతో, ఈ స్థానాన్ని కూటమి అధిష్టానం బీజేపీకి కేటాయించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గుండ్లపల్లి భరత్ కుమార్‌కు గతంలో కొంతకాలం మున్సిపల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, చైర్మన్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై, అలాగే వార్డుల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టికెట్లు దక్కని కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ఈ అసంతృప్తిని కూటమి నేతలు ఏ విధంగా చల్లారుస్తారనేది ఆసక్తికరంగా మారిందని స్థానిక మేధావులు విశ్లేషిస్తున్నారు.
​వైసీపీ అభ్యర్థి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి 45 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నేత అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, పార్టీలకతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిగా ఆయనకు పట్టణంలో గుర్తింపు ఉందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు పదవులపై ఆసక్తి చూపని ఆయన, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బరిలోకి దిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
​క్రాస్ ఓటింగ్ పై జోరుగా చర్చ
ఈసారి కావలి మున్సిపల్ ఎన్నికల్లో 'క్రాస్ ఓటింగ్' జరిగే అవకాశాలు ఉన్నాయని పట్టణ ఓటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వార్డు కౌన్సిలర్‌గా ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా, చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో మాత్రం అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్‌ను బట్టి ఓటు వేసే ఆలోచనలో కొందరు ఓటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సమీకరణాల దృష్ట్యా పట్టణంలో మెజారిటీ వార్డులను కైవసం చేసుకునేందుకు ఇరు పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. తుది తీర్పు ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.