BREAKING
మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం అట్టహాసంగా వందవాగలిలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్ దాఖలు టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన పలు కుటుంబాలు. దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ మందుకు అమెరికా ఎఫ్‌డీఏ నిరాకరణతో పడిపోయిన షేర్లు అనంతసాగరం మండల నాయకులతో మంత్రి ఆనం భేటీ ఊర గ్రామ దేవతలకు పూజ సామగ్రి అందజేసిన దాతలు

తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

Select Suryaa Now
తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

 తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

*వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి, విశేష కలశాభిషేకం

తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ దక్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో విశేష పూజలు, దక్షిణామూర్తి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన నిర్వహించారు. అనంతరం మహాశాంతి అభిషేకం, శ్రీ దక్షిణామూర్తి కలశాభిషేకం వైభవంగా చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ కాలభైరవస్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన నిర్వహించారు.

నేడు శ్రీ కాలభైరవస్వామివారి హోమం
-----------
నేడు శ్రీ కాలభైరవస్వామివారి హోమం నిర్వహించనున్నారు. గృహస్తులు రూ.500 చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  కుమారి దేవి, సూపరింటెండెంట్  చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,