BREAKING
కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

విద్యాసంస్థ అభ్యున్నతికి ప్రసాద్ అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

Select Suryaa Now
విద్యాసంస్థ అభ్యున్నతికి ప్రసాద్ అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

నగరం, మేజర్ న్యూస్:
స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల పాలకవర్గ వైస్ ప్రెసిడెంట్ స్వర్గీయ డాక్టర్ ఎస్ఆర్ కె ప్రసాద్ కళాశాల అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఐదవ వర్ధంతి సంస్మరణ సభలో పలువురు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి స్వర్గీయ డాక్టర్ ఎస్.ఆర్.కె. ప్రసాద్  అందించిన సేవలు, చేసిన కృషి చిరస్మరణీయమని, మారుతున్న విద్యా ప్రమాణాలు, సమకాలీన అవసరాలకు అనుగుణంగా కళాశాలను అభివృద్ధి చేయడంలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు. విద్యాసంస్థ అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. ఆర్ టి ఈ ఐ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎన్ వి కె ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ ఎస్.ఆర్.కె. ప్రసాద్  విద్యా రంగానికి, సమాజానికి అందించిన సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్  వల్లభనేని బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రసాద్  ఆశయాలకు అనుగుణంగా కళాశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్, కళాశాల యూత్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 52 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దండమూడి ధరణి కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్న బాబు, అధ్యాపకులు డాక్టర్ పి. శ్రీనివాసరావు, యు. గోపికృష్ణ, డాక్టర్ ప్రకాష్ బాబు, కార్యాలయ సూపరింటెండెంట్ అమరేష్ రెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్.సి.సి. క్యాడెట్లు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.