BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

తిర్యాణిలో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీలు

Select Suryaa Now
తిర్యాణిలో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీలు
సూర్య తిర్యాణి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్) నూతన కమిటీలను సోమవారం ఏర్పాటు చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మండల అధ్యక్షుడు పుల్లూరి శ్యామ్ మాదిగ, మండల సీనియర్ నాయకుడు కరగంటి బాపు మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సహ బాధ్యుడు జంగపెల్లి రాజేష్ మాదిగ విద్యార్థులతో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాలు, వాటి లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, ఎస్సీ వర్గీకరణ సాధన, అమలు వంటి అంశాల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని రాజేష్ మాదిగ గుర్తుచేశారు. విద్యార్థులు చైతన్యంతో, ఐక్యంగా ముందుకు వస్తే క్లిష్టమైన లక్ష్యాలనూ సాధించవచ్చని అన్నారు. ఈ నెల 23న కొమురం భీం ఆసిఫాబాద్‌లో జరిగే ఎంఎస్‌ఎఫ్ జిల్లా కమిటీ సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో విద్యార్థులు కరిగంటి సాత్విక్, అరవింద్, వంశీకృష్ణ, సుశాంత్ పాల్గొన్నారు.