BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

కావలి 12వ వార్డు బరిలో మునగా మురళీకృష్ణ.. నామినేషన్ దాఖలు.

Select Suryaa Now
కావలి 12వ వార్డు బరిలో మునగా మురళీకృష్ణ.. నామినేషన్ దాఖలు.

​కావలి, మేజర్ న్యూస్ :    కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మునగా వెంకట మురళీకృష్ణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆశీస్సులతో, స్థానిక నాయకులు మరియు కార్యకర్తల కోలాహలం మధ్య ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
​ప్రజా సేవకు అంకితమవుతా: మునగా మురళీకృష్ణ
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మునగా వెంకట మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, తనపై నమ్మకంతో 12వ వార్డు ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు కలగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
​రాబోయే ఎన్నికల్లో 12వ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూర్తి సహకారంతో వార్డులో దీర్ఘకాలికంగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి, 12వ వార్డును అన్ని విధాలా ఆదర్శవంతమైన వార్డుగా, అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మురళీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.