BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

దివంగత నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

Select Suryaa Now
దివంగత నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ
సూర్య, మందమర్రి : సేవా కార్యక్రమాలతో దివంగతుల జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేందుకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దివంగత కంకణాల నవీన్ జ్ఞాపకార్థం సోమవారం పట్టణంలోని చిన్నారులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ.. కంకణాల నవీన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకార్థం సమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించిన వారవుతారని తెలిపారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించాలని ఆయన కోరారు. దాతల సహకారంతో నిరుపేదలకు, అవసరమైన చిన్నారులకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తామని వెల్లడించారు. సేవా కార్యక్రమాల ద్వారా నవీన్ జ్ఞాపకాలను ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజ్ కుమార్, పృథ్వీ, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.