రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్: రాయచోటి రూరల్ మండలం చెన్నాముక్కపల్లి గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా చెన్నూర్ కిరణ్ కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు మౌర్యా రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి గ్రామంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు...వారి వెంట సీనియర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.