భీమవరంలో జనసేన పార్టీకి షాక్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరిక . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుండం కృష్ణారెడ్డి ఎంపిక
వత్సవాయి, నవంబరు 16: జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ పార్టీ అధ్యక్షులు గుండం రంగారెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీకి చెందిన నిడిగుండ యాదగిరి, నిడిగుండ శ్రీహరి, ఎంకేపల్లి ధర్మేంద్ర, ఎంకేపల్లి నాగరాజు, దాదే గోపి తదితరులు జనసేన పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ళ చల్లారావు సమక్షంలో పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా భీమవరం గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుండం కృష్ణారెడ్డిని ఎంపిక చేసినట్లు నాయకులు ప్రకటించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గంగిపోగు రమేష్, మాజీ సొసైటీ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాస్ రెడ్డి, చిట్టా నరేష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.