BREAKING
ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్ ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి

సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో....

Select Suryaa Now
సి ఎం రేవంత్ రెడ్డి  సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో....

.దుబ్బాక …తెలంగాణ రాష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది లో వెనక బాటు ఉందని పలు రాజకీయ నాయకులు తమ స్వార్థ పూరిత రాజకీయాల కోసం పాకులాడుతున్నరే తప్ప అభివృద్దికి నోచుకోకపోవడం బాధాకరమని బీ ఎల్ ఎఫ్ చైర్మన్ బహుజన లిబరల్ ఫ్రంట్ ఛైర్మెన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు, దుబ్బాక లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి ఎస్ పి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాచవరం వెంకటేశ్వరరావు తో కలిసి మాట్లాడారు, దుబ్బాక చేనేత అద్భుత కళలకు నిలువెత్తు నిదర్శనమని  దుబ్బాక నియోజకవర్గ పరిధిలో పని చేసే చేనేత పద్మశాలి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రూ 50 కోట్లు కేటాయించాలని దుబ్బాక మున్సిపాలిటీ కి పలు వార్డు లలో అభివృద్ది పనులకు రూ 80 కోట్లు నూతనంగా ఏర్పాటు చేసిన భుంపల్లి అక్బర్పేట మండలం, రాయపోల్, నార్సింగ్ మండలల అభివృద్ధికి పలు గ్రామ పంచాయితీ లకు రూ 10 లక్షల చొప్పున రూ 65 కోట్లు కేటాయించాలని మిర్ దొడ్డి చెగుంట మండలాలకు రూ 10 కోట్ల చొప్పున రెండు మండలలకు కలిపి రూ 20కోట్లు కేటాయించాలని వీటిపై అధికారులు దుబ్బాక నియోజకవర్గ ఏడు మండలకు ప్రణాళికలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు, మల్లన్న సాగర్ ఏర్పాటుతో తమ గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని తమ బ్రతుకులను అంధకారంలోకి నెట్టివేసిన మల్లన్న సాగర్ బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి వారికి తగిన పరిహారంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని బీ ఎల్ ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు కోరారు,రైతులకు సాగునీరు, విద్యుత్  గిట్టుబాటు ధర వంటి సంక్షేమ పథకాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యెక నిధులు కేటాయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సాన తిరుపతి గుండా శ్రీనివాస్ మల్లేశం వెంకటేశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు