BREAKING
12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్ ఏఎస్ పేటలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతోనే నేరేడ్ మెట్ డివిజన్‌లో అభి వృద్ధి పనులు పూర్తి అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి ఉపేం దర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలోని జీకే కాలనీలో రూ.17 లక్షలతో, వివేకానందపురంలో రూ.95 లక్షలతో, మాతృపురి కాలనీలో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను, మాజీ కౌన్సిలర్లు ఎస్.ఆర్.ప్రసాద్, ఇందిరా ప్రియదర్శిని తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ పదవీ హాయం లో మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన సహాకారంతోనే నేరేడ్ మెట్ డివిజన్‌లో సుమారు రూ.180 కోట్ల నిధులు తీసుకు వచ్చి, కాలనీలలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింద న్నారు. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా నేరేడ్ మెట్ డివిజన్ లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయని, మళ్లీ మైనంపల్లి హన్మం తరావు చొరళతో వేగం పుంజుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్‌లో చేప ట్టిన అభివృద్ధి పనులకి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలను చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తన  నిధులతో చేపట్టిన  అభివృద్ధి పనులు ఏమీ లేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తున్న జనరల్ ఫండ్ నిధులతో చేపడుతున్న పనులకు ఎమ్మెల్యే, ప్రారంభోత్సవాలు చేస్తూ, తానే  నిధులు తీసుకు వచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం సరి కాదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహాకారం, కృషి తోనే నేరేడ్మెట్ డివిజన్‌లోని అన్ని కాలనీలలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడు తున్నామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవన్, కపిలేశ్వర్, పి.ఆశ, శంకర్రావు,శ్యామ్, రొట్టెల ధరన్, మధుసూద న్ రెడ్డి, జాన్, సాయినరేష్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఆల్బర్ట్, సతీష్, బాలరాజు యాదవ్, భాస్కర్, ప్రభ, మహాలక్ష్మి, విజయ లక్ష్మి, సుధానాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు