BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం

Select Suryaa Now
ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం

అనంతసాగరం, మేజర్ న్యూస్ :  గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనంతసాగరం మండలం న కు కేటాయించబడిన స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులకు మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులకు 16వ తేదీన శిక్షణా కార్యక్రమం నిర్వహించడమైనది. స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు గా నియమితులైన అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి, స్వేచ్ఛాయత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలని ఎంపీడీవో కోరారు. అనంతసాగరం మండలం నందు రెండవ విడత లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఈనెల 18, 19, 20 తేదీలలో నామినేషన్ల కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఓటర్ల లిస్టు, సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల రిజర్వేషన్లు స్టేజ్ 1 అధికారులకు అందజేశారు. సర్పంచ్ గా పోటీ చేస్తున్నవారు 3000/-రూపాయలు డిపాజిట్ అమౌంటు చెల్లించవలసి ఉంటుందని, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే 1500/- రూపాయలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అలాగే వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నవారు డిపాజిట్ అమౌంటు వెయ్యి రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే 500/- రూపాయలు డిపాజిట్ మొత్తము చెల్లించవలసి ఉంటుందని ఎంపీడీవో తెలిపారు. స్టేజ్ 1 అధికారులకు ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అందజేశారు. ఎంఈఓ 2 ప్రభాకర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి కుమార్, MOT చంద్రశేఖర్ రెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.