దేశానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో స్కౌట్ మాస్టర్,గైడ్ క్యాప్టెన్ కూడా సైనికుడిగా తయారు చేయాలి ---మెదక్ జిల్లా విద్యాధికారి రాజు
మెదక్ ప్రతినిధి : స్కౌట్,గైడ్ శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక సేవ, దేశభక్తి పెంపందుతుందని మెదక్ జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం హవేలీ ఘనపూర్ మండలం మహాత్మా గాంధీ జ్యోతిబాపులే (ఏంజెబి)ఖాళీ చేసిన స్కూల్ లో మెదక్,కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టనులకు శిక్షణ తరగతులకు మెదక్ జిల్లా విద్యాధికారి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారి రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న స్కౌట్ మాస్టర్లు,గైడ్ కెప్టెన్ లు ఏడు రోజులు పాటు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో స్కౌట్ మాస్టర్,గైడ్ కెప్టెన్ కూడా సైనికుడిగా తయారు చేయాలన్నారు. బేసిక్స్ శిక్షణ పొందినవారే తమ విద్యార్థులకు సక్రమంగా శిక్ష నుంచి అవకాశం ఉంటుందన్నారు. క్రమశిక్షణకు మారు పేరు అని, విద్యార్థి దశలో ప్రతి ఒక్కరు స్కౌంట్ లో చేరాలన్నారు.స్కౌట్ ఏఎస్ఓసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రలో ఈరోజు సంగారెడ్డి,జీడిమెట్ల, మహబూబ్ నగర్,మెదక్ జిల్లాలో స్కౌట్ మాస్టర్,గైడ్ కెప్టెన్ లకు శిక్షణ ఇస్తున్నారు.ఇందులో మెదక్ జిల్లాలో ఎక్కువ మంది శిక్షణ పొందుతున్నoదుకు చాలా సంతోషం, మెదక్ జిల్లా విద్యాది కారి రాజు, స్కౌట్ మెదక్ జిల్లా కార్యదర్శి రాజేందర్ ప్రోత్సాహంతోనే అని ఆయన అన్నారు. అనంతరం స్కౌట్ గైడ్ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా స్కౌట్ జిల్లా కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర అబ్జర్వర్స్ వెంకట స్వామి, జిల్లా శిక్షణ అధికారి మహిపాల్,ఆర్గనైజర్ కార్యదర్శి నాగరాజు, గైడ్ ఎల్వోసి అమర జ్యోతి, డిఆర్పి లతీఫా, శిరీష,మెదక్,కామారెడ్డి జిల్లాల స్కౌట్ మాస్టర్, గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.