BREAKING
వేరే ఏ దర్శకుడు అడిగినా జుట్టు కత్తిరించుకునేదాన్ని కాదు.. 'ఓం' లుక్‌పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు! కావలి 12వ వార్డు బరిలో మునగా మురళీకృష్ణ.. నామినేషన్ దాఖలు. బయోటెక్ రంగంలో ఎలి లిల్లీ భారీ కొనుగోలు కావలిలో వేడెక్కిన మున్సిపల్ రాజకీయం.. పోటాపోటీగా చైర్‌పర్సన్ అభ్యర్థుల నామినేషన్లు. 'కెరూబ్' ట్రైలర్ అదుర్స్.. మన అడవుల్లో తీసిన 'అవతార్'లా ఉందన్న డైరెక్టర్ సముద్ర! వారెన్ బఫెట్ మరో కీలక నిర్ణయం పండుగ వాతావరణంలో నూతన చేయూత.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన 20 గిరిజన కుటుంబాలు. దివంగత నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ కాటిమాయకుంట సర్పంచ్ గా  దేవర సుజాత నామినేషన్ ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకే కేటాయించాలి ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం తిర్యాణిలో మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీలు అమెరికాలో కలకలం రేపుతున్న ఎన్విడియా వివాదం ఫోస్ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్ శుభ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వీపీఆర్ దంపతులు

కాకా కుటుంబంపై నిరాధార ఆరోపణలు తగవు

Select Suryaa Now
కాకా కుటుంబంపై నిరాధార ఆరోపణలు తగవు
సూర్య, మందమర్రి : దివంగత మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి (కాకా) కుటుంబంపై బీఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాకా కుటుంబం తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను విస్మరించి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. సోమవారం మందమర్రిలోని బి-1 క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవ, పార్టీ అభివృద్ధికి కృషి చేసిందని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, జైపూర్ పవర్ ప్లాంట్ సాధనతో పాటు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకా చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. కాకా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం వారికి తగిన గుర్తింపు ఇచ్చిందని స్పష్టం చేశారు. సింగరేణి క్వార్టర్ల కేటాయింపు విషయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గతంలో కేటాయించిన ఎగ్జిక్యూటివ్ క్వార్టర్‌ను వివేక్ స్వచ్ఛందంగా సింగరేణి సంస్థకు తిరిగి అప్పగించాలని నిర్ణయించుకున్నారని, దానిని ఖాళీ చేయించే విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సింగరేణి నిబంధనల ప్రకారం పలువురు కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా క్వార్టర్లలో నివసిస్తున్నారని గుర్తుచేశారు. ఇసుక, బొగ్గు అక్రమ రవాణాపై కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల్క సుమన్ అండదండలతో పెద్దఎత్తున ఇసుక, బొగ్గు అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఇందారం వద్దకు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మద్దిశంకర్‌కు సవాల్ విసిరారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడు రమణారావును ప్రాంతీయత ఆధారంగా విమర్శించడం సమంజసం కాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంత్రి అందుబాటులో లేని సమయంలో నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అనుసంధానకర్తగా ఉంటూ ఆయన సేవలందిస్తున్నారని తెలిపారు. గతంలో ఇదే వ్యక్తి ద్వారా, విశాఖ ట్రస్ట్ నిధుల ద్వారా ప్రయోజనం పొందిన విషయాన్ని మద్దిశంకర్ గుర్తుంచుకోవాలని సూచించారు. అభివృద్ధి అంటే కేవలం సెంట్రల్ లైటింగ్, పార్కులు, ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం మాత్రమే కాదని, గ్రామాలు, వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే అసలైన అభివృద్ధి అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రానున్న రెండుమూడేళ్లలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అమృత్ పథకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, జోడువాగు ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజా సంక్షేమమే మంత్రి వివేక్ వెంకటస్వామి లక్ష్యమని పేర్కొన్నారు. బాల్క సుమన్, మద్దిశంకర్‌లు వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, దళితుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు ఆ వర్గాల కోసం చేసిన కృషిని వివరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాకా కుటుంబాన్ని, మంత్రి వివేక్ వెంకటస్వామిని కించపరిచే వ్యాఖ్యలను పునరావృతం చేస్తే రాజకీయంగా గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కనకం రాజు, సీనియర్ నాయకులు సొంతుకు సుదర్శన్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, మాల సంఘం జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి లక్ష్మణ్, ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి సుద్దాల రాజ్‌కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు తుంగపిండి రాజేష్, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు సొంతుకు ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.