BREAKING
మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్లు తనకు మద్దతుగా నిలవాలి ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: టికెట్ ధర రూ. 4300 వరకు పలికినా తగ్గని క్రేజ్! టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన అమ్మవారి సందర్శనం సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

దుబ్బాక నియోజకవర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

Select Suryaa Now
దుబ్బాక నియోజకవర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట మేజర్ న్యూస్ ప్రతినిధి ;. సంవత్సరాల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రజా ప్రభుత్వం చేయూత పింఛన్లు అందిస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.సోమవారం అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలోని రామలింగేశ్వర గార్డెన్స్‌లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు కలిపి మొత్తం 1,924 మందికి కొత్త చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. అలాగే రెండో విడతలో 523 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రస్తుతం రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. మొదటి విడతలో ఇళ్లు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.

ప్రతి పథకం పేదల సంక్షేమం కోసమే..

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రతి నెలా ఒక్కో అర్హ కుటుంబానికి సుమారు రూ.1,200 వరకు విద్యుత్ బిల్లు భారం తగ్గుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, ఈ పథకం అమలుకు మూడేళ్లలో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.12 వేల కోట్ల నిధులు అందించిందని తెలిపారు.కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల కోసం ప్రజలు అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేశారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తోందన్నారు. అదనంగా వైద్య ఖర్చుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.2,500 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించినట్లు వివరించారు.దుబ్బాక నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామన్నారు. పేద ప్రజలు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి వ్యాఖ్యలు…

రాష్ట్రంపై గత ప్రభుత్వాలు సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు భారం మోపాయని, ప్రభుత్వం ప్రతి నెలా పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.36 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి, రూ.11 వేల కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.జిల్లాలో ఇప్పటివరకు రూ.330 కోట్ల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందించినట్లు తెలిపారు. ఈ నెల 19న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

చేనేత కార్మికులందరికీ పింఛన్లు అందించాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి…

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నూతన పింఛన్ల మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించాలని మంత్రిని కోరారు. దుబ్బాక నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ పథకాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి: కలెక్టర్…

జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని చేయూత పింఛన్ల లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి లభ్యత తక్కువగా ఉందని, రైతులు నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధరిపెల్లి చంద్రం, దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.