ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ ఆత్రేయపురం గ్రామంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రావణ నక్షత్ర మాస కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి పవన్ తేజ దీక్షితులు, సాయి పవన్, రవికృష్ణ నేతృత్వంలో వేదమంత్రాల నడుమ కల్యాణ క్రతువులు శాస్త్రోక్తంగా జరిపించారు కళ్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణ రాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు యలమర్తి కార్తికేయ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్న ఆలయ మేనేజర్ వినయ్ కుమార్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు