BREAKING
మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్లు తనకు మద్దతుగా నిలవాలి ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: టికెట్ ధర రూ. 4300 వరకు పలికినా తగ్గని క్రేజ్! టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన అమ్మవారి సందర్శనం సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం..

Select Suryaa Now
విశాఖలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం..

విశాఖపట్నం: కాలుష్య రహిత ప్రజా రవాణా దిశగా విశాఖ నగరం మరో కీలక అడుగు వేసింది. నగరంలో నూతనంగా ప్రవేశపెట్టిన 30 ఎలక్ట్రిక్ (EV) మెట్రో సిటీ బస్సుల సర్వీసులను గాజువాక ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD) శివప్రసాద్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ ప్రజలకు కాలుష్యం లేకుండా ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' పథకం కింద ఈ ఎలక్ట్రిక్ బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖ సిటీలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతామని, భవిష్యత్తులో మరిన్ని ఆధునిక ఫీచర్లు, సాంకేతిక సదుపాయాలతో కూడిన కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.