telangana
సామూహిక సెలవు కోరిన పంచాయతీ కార్యదర్శులు
సూర్య, పెంచికల్‌పేట్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెంచికల్‌పేట్ మండల పంచాయతీ కార్యదర్శులందరూ సామూహిక సెలవు కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో గాజుల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు సామూహిక సెలవు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ పాల్గొన్నారు.