అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్ మేజర్ న్యూస్ ప్రతినిధి ;నర్సాపూర్ నియోజకవర్గంలో 3775 మంది లబ్ధిదారులకు రూ.88,14, 400 లక్షల పింఛన్లు పంపిణీసోమవారం నర్సాపూర్ పట్టణం లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేయుత పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు పంపిణీ చేసిన మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి, పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే, సునీత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ లుఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని చిలిపిచేడ్ మండలంలో364 మందికి రూ.87,18,24, కౌడిపల్లి మండలంలో 598 మందికి రూ.13,91,568 చొప్పున, కుల్చారం మండలం 548 13,027,68 మంది మాసాయిపేట మండలం 263 మంది లబ్ధిదారులకు రూ.600208 , నర్సాపూర్ 555 రూ 1276880,, నర్సాపూర్ మున్సిపాలిటీ -244 లబ్ధిదారులకు రూ.597904, శివంపేట మండలం 720 మంది లబ్ధిదారులకు రూ.1667520 , వెల్దుర్తి మండలం 483 మంది లబ్ధిదారులకు రూ.1105728 విలువైన పింఛన్లు మంజూరయ్యాయన్నారు.వీరిలో కల్లుగీత కార్మికులు 128 మంది, దివ్యాంగులు602 మంది, వితంతువులు 2635 మంది, ఒంటరి మహిళలు 366 మంది ఉన్నారన్నారు.ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బెస్మెట్ లెవల్ నిర్మాణం ఐతే ఇందిరమ్మ డబ్బులు విడతలు వారిగా లబ్ధిదారుకు బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు..
కాని, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుటకు ముందుగా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వివిధ కార్పొరేషన్ల ద్వారా కార్లు, ట్రాక్టర్లు పొందిన వారికి కూడా పెన్షన్లు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి వో శ్రీనివాస్ రావు, ఆర్డీవో రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు .