telangana
మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సూర్య .నేరడిగొండ : మహిళల ఆర్థిక స్వావలంబనకు, సంఘటిత శక్తి బలోపేతానికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతగానో ఉపయోగ పడతాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, స్థానిక సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల బలోపేతంతో పాటు, సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఇలాంటి భవనాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళలు ఒకే వేదికపై సమావేశమై తమ సమస్యలను చర్చించుకోవడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించుకునేందుకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.మహిళా సమాఖ్య సభ్యులు నూతన భవనాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహిళల ఐక్యత, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగసాగర్ రెడ్డి, ఏలేటి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ , మహిళా సంఘాల సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.