telangana
బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ
సూర్య, జన్నారం : జన్నారం మండలం బాదంపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా మంజూరైన విలేజ్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పనులకు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక సర్పంచ్ సామల్ల విజయలక్ష్మి లక్ష్మీరాజం మాట్లాడుతూ గ్రామానికి వివో భవనం విబిజీ రాంజీ నిధుల నుండి మంజూరు కావడం సంతోషకరమన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాసెట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటపలుకుల లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు రవి, గడ్డి శంకర్, రాజేందర్, రాజేష్, గ్రామ కార్యదర్శి సంతోష్, ఐకెపి సిబ్బంది రజిత, సదాచారి, రమాదేవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.