BREAKING
మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. గ్రంధాలయం వారోత్సవాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్లు తనకు మద్దతుగా నిలవాలి ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: టికెట్ ధర రూ. 4300 వరకు పలికినా తగ్గని క్రేజ్! టీఎన్జీవోలో 25 మంది రెవెన్యూ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన అమ్మవారి సందర్శనం సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక !

Select Suryaa Now
వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక !

 

 

సూర్య, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని శ్రీనిత్య వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. చిన్న వయస్సులోనే క్రీడారంగంలో ప్రతిభ చాటుతూ పాఠశాలకు గుర్తింపు తీసుకురావడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నవంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన అండర్-14 (యు-14) రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీల్లో శ్రీనిత్య పాల్గొని తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పుష్పగుచ్ఛం అందించి ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. శ్రీనిత్యలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు.