నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక
బలిజిపేట, సూర్య: బలిజిపేట మండలం నారన్నాయుడు వలస గ్రామానికి చెందిన ఆబోతుల భాస్కర్ రావు గారి తో పాటు సుమారు 10 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ సర్పంచ్ సోము చిట్టి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కార్యక్రమంలో నారన్నా యు డు వలస లో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తమకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం అందలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నాయకత్వం పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వెల్లడించరు