BREAKING
కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మహనీయుల చిత్రపటాలకు నివాళి ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు డైరెక్టర్ క్రేజీ కామెడీ మూవీ.. అనుమాన పక్షి స్ట్రీమింగ్ ఎక్కడంటే! మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో!

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి

Select Suryaa Now
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాష్ట్రంలో పలు కోర్సులలో విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులందరికీ నెలకు రూ.5వేల చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వీయూ గుర్తొచ్చినప్పుడల్లా తిరుపతి రాజధాని గుర్తొస్తుందన్నారు. 1953లో తరిమెల నాగిరెడ్డి, ఎన్నో రంగా తిరుపతిని రాజధాని చేయాలని కోరడం జరిగిందన్నారు. రాజధానికి బదులు ఎస్వీయూ ఏర్పాటు చేశారని చెప్పారు. తిరుపతి రాజధాని చేసి ఉంటే నగరం ఎంతో అభివృద్ధి సాధించి ఉండేదన్నారు. రాబోవు రెండు మూడు సంవత్సరాల్లో తిరుపతి రాజధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎస్వీయూలో చదివిన చంద్రబాబు నాయుడు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యూనివర్సిటీకి ఏమి చేయలేకపోయాడని విమర్శించారు. ఏ ఒక్కరికైనా కనీసం ఒక పెన్ను, ఒక పుస్తకమైనా ఇచ్చాడా... అని ప్రశ్నించారు. మనిషి చనిపోతే పూడ్చడానికి, కాల్చడానికి జానెడు జాగా లేదన్నారు. స్మశానాలు లేక జనం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కోటీశ్వరులకు లక్షల ఎకరాల భూములను ఇచ్చిన ఘనత చంద్రబాబుకు నాయుడికి దక్కిందన్నారు. కివీ, మామిడి పండ్లు పండించేదానికి రాయలసీమలో 90 వేల ఎకరాలు భూములు ఒక కోటీశ్వరుడికి కట్టబెట్టారని తెలియజేశారు. దేశం మొత్తం మీద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్లు రావడానికి కారణం ఇందిరా గాంధీ, చింతామోహన్, కాంగ్రెస్ పార్టీ కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, తేజోవేతి, సమీవుల్లా, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్