BREAKING
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల

కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Select Suryaa Now
కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు వెండితెరపై వినోదంతో పాటు ఉత్కంఠను పంచే హారర్ కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆ కోవలో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూనే, మరోవైపు వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తున్న సరికొత్త హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ భూతం ప్రేతం. సృజన ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత బి. వెంకటేశ్వరరావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్నారు. బుల్లితెరపై తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఇమాన్యుయేల్‌తో పాటు బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా ఈ సినిమా అధికారిక విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. భూతం ప్రేతం చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడిస్తూ ప్రత్యేక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు, ప్రేక్షకులను భయపెట్టే అసలైన హారర్ అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో నటీనటులందరూ ఒక్కొక్కరు ఒక్కో విభిన్నమైన హావభావాలతో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో సినీ ప్రియులను ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన పూర్తిస్థాయి వినోదం, సస్పెన్స్ ఎలిమెంట్స్ తమ చిత్రంలో ఉన్నాయని ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ గట్టిగానే సంకేతాలు ఇచ్చారు.

విడుదల తేదీ ఖరారు కావడంతో ఇకపై సినిమా ప్రమోషన్ల జోరు పెంచేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ వంటి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లతో ప్రేక్షకులను అలరించనున్నారు. మరి డిసెంబర్ 11న థియేటర్లలో నవ్వులు, భయం కలగలిసిన భూతం ప్రేతం సందడి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో అలరిస్తుందో వేచి చూడాలి.