కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం....
సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్
సూర్యాపేట 17వ అంబేద్కర్ నగర్లో ఈరోజు
పవిత్రమైన కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజున అంబేద్కర్ నగర్ శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణ్ హనుమత్ సమిత రామాలయం లో ప్రధాన అర్చకులు చిలకమర్రి శ్రీనివాస్ చార్యులు ఆధ్వర్యంలో పవిత్రమైన కార్తీక మాసం లో మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ నగర్ 17 వార్డులో శ్రీరామాలయంలో విశేషంగా శివాభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పర్వదినం రోజున భక్తులు వారి యొక్క అభిస్తనా కోరికలు అంటే వారి మనసులో ఉన్న కోరికలు ఆ శివయ్యకి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క సమస్యలు ఏది ఉన్న వారి మనసులో చెప్పుకొని ఈ రోజు ఈ కార్తీకమాసం మొదటి సోమవారం రోజున చెప్పుకొని శివాభిషేకం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి అని ఇతిహాసాలు శాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం ఈరోజు రామాలయం ప్రధాన అర్చకులు భక్తులకు విన్నపించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో భజనలు కీర్తనలు పాడి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు