BREAKING
ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్ 24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ఆఫీసులకు కొత్త నిబంధనలు: స్వచ్ఛంద నియమావళి! రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన

రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

 

*సూర్యాపేట టౌన్ మేజర్ న్యూస్*

సూర్యాపేట: రైతులు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్ర పరిధిలోని రాయినిగూడెం 1, 2, కుడకుడ, దాసాయిగూడెం లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం విక్రయాల ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి ఎం సి రమేష్ నాయక్, టిఎంసి వసంత్ కుమార్,11వ వార్డు కౌన్సిలర్ ఎల్గూరి ఇందిర వీరయ్య గౌడ్, బానోత్ సైదులు, కాంగ్రెస్ నాయకులు పంతంగి దశరథ, మాజీ ఎంపీటీసీ ఎల్గూరి వెంకటేశం గౌడ్, రాయని గూడెం 1 ఐకెపి కేంద్రం అధ్యక్షులు ఎల్గూరి వినోద ఆర్పి నామ శిరీష కార్యదర్శి జ్యోతి కోశాధికారి సునీత, పతాని ఉప్పమ్మ, రాయిని గూడెం 2 ఐకెపి కేంద్రం అధ్యక్షురాలు గౌతమి, కార్యదర్శి కె మంగమ్మ, కోశాధికారి ధనమ్మ, ఆర్పి ఫణిమా,కుడకుడ ఐకెపి కేంద్రం అధ్యక్షురాలు సంతోషి కార్యదర్శి రాములమ్మ కోశాధికారి లక్ష్మమ్మ ఆర్పీలు పి కవిత వై సంధ్యారాణి, దాసాయి గూడెం ఐకెపి అధ్యక్షురాలు శిరీష, కార్యదర్శి పుల్లమ్మ, కోశాధికారి మంగమ్మ, ఆర్పీ సైదమ్మ, కమిటీ సభ్యులు సైదమ్మ, మంగమ్మ, పార్వతమ్మ, రైతులు వేములకొండ లక్ష్మయ్య, శివమణి, నవీన్, బానోత్ సురేష్, ధరావత్ శ్రీను, తాటికొండ పాపిరెడ్డి,కృష్ణ, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.