BREAKING
ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మహనీయుల చిత్రపటాలకు నివాళి ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు డైరెక్టర్ క్రేజీ కామెడీ మూవీ.. అనుమాన పక్షి స్ట్రీమింగ్ ఎక్కడంటే! మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా!

ఘనంగా 365 వోత్తుల దీపారాధన

Select Suryaa Now
ఘనంగా 365 వోత్తుల దీపారాధన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో తొలి సోమవారం సందర్భంగా చిగోరి ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో పరమశివునికి ప్రత్యేక పూజలు, కోటి సోమవార దీపారాధన ఘనంగా నిర్వహించారు. శివనామ స్మరణతో దామోదర నామంతో పరమేశ్వరిని సేవించడం నాటి నుంచి వస్తున్న సత్సంప్రదాయమని, పుణ్యప్రదమైన కార్తీక మాసంలో తొలి సోమవారం కోటి సోమవారంగా ప్రసిద్ధి చెందిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా 365 వోత్తులతో పరమేశ్వరుని సన్నిధానంలో దీపారాధన చేస్తే కోటి సోమవారాలు దీపారాధన చేసిన ఫలితం వస్తుందని సనాతన ధర్మం చెబుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదాశివునికి పాతకాలపు పద్ధతిలో అభిషేకం, అర్చన, అలంకారాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం సంధ్యా దీపం, అఖండ దీపారాధన, అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు చిత్తూరు హనుమంతరావు, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్