పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు...
విజయనగరంసూర్య:.పీఎం స్వన్నిధి పథకం అమలులో ఉత్తమ పనితీరును కనపరిచిన విజయనగరం నగరపాలక సంస్థకు అవార్డు లభించింది. ఈనెల 20వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావలసిందిగా కమిషనర్ బాలస్వామి, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావుకు ఆహ్వానాలందాయి. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ వీధి విక్రయదారులకు పీఎం స్వన్నిధి అనేది వరం లాంటిదని అన్నారు. ఎటువంటి హామీ లేకుండా వీధి విక్రయదారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి కింద రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. నగరంలో గుర్తించిన వీధి విక్రయదారులకు రుణాలు అందించడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలులో మంచి ఫలితాలు రావడంతో అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు.