BREAKING
కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం! కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీపై ట్రంప్ సంకేతాలు: చైనా వేదికగా సమావేశం అయ్యే అవకాశం! కార్తీకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు కడుపుబ్బా నవ్విస్తూనే వెన్నులో వణుకు పుట్టించేందుకు సిద్ధమైన భూతం ప్రేతం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పరిశోధన గ్రాంట్ల నిలిపివేతపై అప్పీల్ తిరస్కరణ! అంగరంగ వైభవంగా తేజ సజ్జా - మౌర్యల నిశ్చితార్థం.. కాబోయే జంటను ఆశీర్వదించిన వేమూరి రాధాకృష్ణ! ఫుట్బాల్ టోర్నీలో విజేతగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మహనీయుల చిత్రపటాలకు నివాళి ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు డైరెక్టర్ క్రేజీ కామెడీ మూవీ.. అనుమాన పక్షి స్ట్రీమింగ్ ఎక్కడంటే! మహిళా వర్సిటీకి ద్వితీయ బహుమతి ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో!

మహనీయుల చిత్రపటాలకు నివాళి

Select Suryaa Now
మహనీయుల చిత్రపటాలకు నివాళి

 

ముత్యాల రెడ్డిపల్లిలోని బాలల గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం మూడో రోజు జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రెడ్డి వారి గురువారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై  గ్రంథాలయ పితామహులు డా.ఎస్సార్ రంగనాథన్, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణంను స్మరించుకుంటూ ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ గురవారెడ్డి మాట్లాడుతూ 59వ జాతీయ గ్రంథాల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, మొదటి రోజు బాలల దినోత్సవం, రెండో రోజు పుస్తక ప్రదర్శన, మూడో రోజు గ్రంథాలయ పితామహులను స్మరించుకునే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గ్రంథాలయాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడతాయి. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం వైపు మొగ్గు చూపి సరస్వతీ నిలయాలైన గ్రంథాలయాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కూటమి ప్రభుత్వం  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గ్రంథాలయాల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తోంది. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అన్ని రకాల పుస్తకాలను తీసుకొచ్చాం, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి 20వ తేదీన బహుమతులు ప్రధానం చేస్తాం. అలాగే కవులు, కళాకారుల ద్వారా మన ప్రాచీన జానపద గేయాలు, పద్యాలు, పూర్వీకుల సంప్రదాయాన్ని నేటి తరానికి తెలియజేసే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు ధనంజయులు, ప్రసాద్ బాబు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నడ్డి నారాయణ, మునిలక్ష్మి, సురేష్, సిద్ధారెడ్డి, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్