జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: గ్రంథాలయమే విజ్ఞాన నిలయం అని చాటుతూ 59వ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు శాఖా గ్రంథాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ గ్రంథాలయ అధికారి శంకర్ బాబు హాజరై గ్రంథాలయ గ్రంథాలయ అధికారిణి ఏ.శ్రీముఖితో కలసి గ్రంథాలయ ఉద్యమ పితామహుడు డా.ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వారి సేవలు ఎనలేనివని, నేటి తరం వారి స్ఫూర్తితో పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు దేశభక్తి గీతాలు, నీతి పద్యాలు, కథల చెప్పే పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి ఏ.శ్రీముఖి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్