BREAKING
జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్ 24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ఆఫీసులకు కొత్త నిబంధనలు: స్వచ్ఛంద నియమావళి! రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం!

యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు

Select Suryaa Now
యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు

జిన్నారం ; :ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో యాసంగి సాగు పనులు ప్రారంభమయ్యాయి. పొలాల్లో నాగళ్లు కదులుతుండగా, రైతులు భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి ప్రకృతి సహకరిస్తుందా? పంటలు చేతికొచ్చే పరిస్థితులు ఉంటాయా? అన్న సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి. గత వానాకాలంలో ఎదురైన చేదు అనుభవాలను మరిచిపోయి, కొత్త ఆశలతో యాసంగి సాగుకు రైతన్నలు సమాయత్తమవుతున్నారు. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం?, బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు గత పంటల నష్టాలు, అప్పుల భారం ఇంకా రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. పెట్టుబడులకు డబ్బులు సమకూర్చుకోవడం కూడా రైతులకు సవాలుగా మారింది. అయినప్పటికీ భూమిపై నమ్మకంతో సాగు పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి యాసంగి సీజన్‌లోనూ మంచి దిగుబడులు సాధించాలనే ఆశతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటూ పొలాల బాట రైతులు  పడుతున్నారు. ఈసారి అయినా వర్షాలు సమృద్ధిగా కురిసి, చెరువులు నిండి, బావుల్లో నీటి మట్టాలు పెరిగితే సాగుకు ఇబ్బందులు తొలగుతాయని ఆశిస్తున్నారు. గత అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పినా రైతన్న ఆశ మాత్రం చావడం లేదు. ప్రకృతి అనుకూలించి పంటలు పండితేనే అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లోనైనా రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా? కాలం కరుణించి పంట పొలాల్లో పచ్చదనం నింపుతుందా? అన్నది వేచి చూడాలి.