BREAKING
మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్ 24న యోగుల పర్వతంపై కార్తీక దీపోత్సవం వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!"* *రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు?

నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన

Select Suryaa Now
నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన

జిన్నారం :విద్యార్థుల్లో చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించేందుకు నిర్వహించిన క్షేత్ర పర్యటన సత్ఫలితాలనిచ్చింది. ఇందులో భాగంగా బొల్లారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి వివిధ వృత్తి విద్యా కోర్సులపై అవగాహన పొందారు. ప్రధానోపాధ్యాయులు జి. మంగీలాల్ ఆధ్వర్యంలో 140 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. సంస్థలోని కంప్యూటర్ శిక్షణ కేంద్రం, ఐటీ విభాగం, సమావేశ మందిరాలను పరిశీలించిన విద్యార్థులు సాంకేతిక విద్యకు సంబంధించిన పలు అంశాలను తెలుసుకున్నారు. బ్యూటీ అండ్ వెల్‌నెస్ విభాగంలో అందిస్తున్న ప్రాక్టికల్ శిక్షణను పరిశీలించి, ఆయా రంగాల్లో నైపుణ్యాలు సాధిస్తే స్వయం ఉపాధి పొందే అవకాశాలున్నాయని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వసంత రాణి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో కేవలం విద్యార్హతలే కాకుండా వృత్తి నైపుణ్యాలు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన పదో తరగతి ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల శిక్షణ అనంతరం అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తున్నట్లు వివరించారు. ఈ పర్యటన విద్యార్థులకు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, చదువు పూర్తయిన తర్వాత ఉపాధి పొందేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టతనిచ్చింది. పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధిపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బొల్లారం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.