BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం

Select Suryaa Now
9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం

 

సంగారెడ్డి ;  సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రాంగణంలో మరో అపూర్వ ఆధ్యాత్మిక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.9 కోట్ల వ్యయంతో మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో నిర్మించ తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్న సువర్ణ శృంగ నందీశ్వర స్వామి ఏకశిలా విగ్రహ నిర్మాణ పనులను సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మల ప్రారంభించారు.శ్రీ కైలాస ప్రస్తార మహామేరు నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీ ఏకశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శిలా పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

684 టన్నుల భారీ ఏకశిలతో నిర్మాణం

నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం కోసం సంగారెడ్డి సమీపంలోని ఎర్దనూర్ గుట్టల నుంచి 684 టన్నుల బరువున్న భారీ ఏకశిలను సేకరించారు. 32 అడుగుల పొడవు, 19.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు కలిగిన ఈ అరుదైన శిలతో భారీ నందీశ్వర స్వామి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఈ ఏకశిలను 284 చక్రాలు కలిగిన ప్రత్యేక భారీ వాహనంపై త్వరలో ఫసల్‌వాది విద్యాపీఠానికి తరలించనున్నారు.

ప్రతి ఒక్కరూ మహాక్రతువులో భాగస్వాములు కావాలి జగ్గారెడ్డి

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వర శర్మ సిద్ధాంతి చేపట్టిన ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం సంగారెడ్డి ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఇంతటి భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం ద్వారా ఫసల్‌వాదికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మహాక్రతువు వెనుక మహేశ్వర శర్మ సిద్ధాంతి కృషి, పట్టుదల, ఆధ్యాత్మిక సంకల్పం అభినందనీయమన్నారు.ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా ఎవరికి తోచినంత వారు సహాయం అందించి ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకోవాలని కోరారు. తాను కూడా వ్యక్తిగతంగా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు.అదేవిధంగా ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్మాణం పూర్తయితే ఫసల్‌వాది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించిన మహేశ్వర శర్మ సిద్ధాంతి అంతకుముందు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ.. నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణ విశిష్టతతో పాటు శ్రీ కైలాస ప్రస్తార మహామేరు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించారు. ఇంతటి భారీ ఏకశిలను గుర్తించి, దానితో నందీశ్వర స్వామి విగ్రహాన్ని నిర్మించాలనే సంకల్పం ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యాపీఠ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.