నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు
రాయికోడ్, ; రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరయ్యాయని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య తెలిపారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా నూతన పెన్షన్ల మంజూరు పత్రాలు నేడు మంగళవారం నాడు మునిపల్లి లోని ఎస్ ఆర్.ఆర్ ఫంక్షన్ హాల్ లో లో మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదల జీవితాల్లో భరోసా నింపుతున్న ప్రజా ప్రభుత్వం అని తెలిపారు మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు చేసి, పంపిణీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి దామోదర రాజనర్సింహ, గారికి ఆనందం వ్యక్తం చేస్తూ రాయికోడ్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.