పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం
కంది ; పల్లె ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపేందుకు సరికొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. కంది గ్రామానికి సమీపంలో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఫార్మ్ ఎలైట్ రిసార్ట్‌ను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.ఈ సందర్భంగా రిసార్ట్ నిర్వాహకుడు వెంకట్ సాయి మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో పుట్టినరోజు వేడుకలు, కుటుంబ సమ్మేళనాలు, గెట్ టుగెదర్ కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఫార్మ్ ఎలైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రిసార్ట్‌లో పార్టీ లాన్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు అనువైన సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడిపేందుకు ఈ రిసార్ట్ చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్, ఉపసర్పంచ్ ఆసద్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.