BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Select Suryaa Now
అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నిజాంపేట ; నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల కేంద్రంలోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి 'చేయూత' పెన్షన్ మంజూరి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాకు అత్యధిక సంఖ్యలో చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని, అందులోనూ నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా పెన్షన్లు రావడం విశేషమని పేర్కొన్నారు. నారాయణఖేడ్ మండలానికి మొత్తం 344 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన అనేక కుటుంబాలు, ముఖ్యంగా దివ్యాంగులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారే తప్ప పేద ప్రజలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారిని గుర్తించి, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం వారికి చేరేలా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజాప్రతినిధులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ఆయన ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.