BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు

Select Suryaa Now
కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు

సంగారెడ్డి ; కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఇప్పటికైనా అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వద్ద ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, ఈలోగా అన్ని హామీలను అమలు చేయాలని కోరారు.మూడేళ్ల తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని, అయినప్పటికీ ఇంకా అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందక ఎదురుచూస్తున్న పేద కుటుంబాల దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడు అందిస్తుందని ప్రశ్నించారు. కేవలం చెక్కుల పంపిణీతో సరిపెట్టకుండా తులం బంగారం హామీని కూడా అమలు చేయాలని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.