పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు....
విజయనగరం సూర్య: నగరంలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కమిషనర్ బాలస్వామి స్పష్టం చేచేశారుక్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పారిశుధ్య పనితీరును గమనించారు. సేకరించిన చెత్తలను ఎప్పటికప్పుడు చెత్త తరలించే వాహనాల్లో డంపింగ్ యార్డ్ కు చేరే విధంగా చూడాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ శతశాతం అమలయ్యే విధంగా చూడాలన్నారు. నిర్ణీత సమయానికి పారిశుధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారా లేదా అని గమనించారు. డివైడర్ల మధ్యలో ఎటువంటి చెత్తాచెదారాలు లేకుండా చూడాలన్నారు. మొక్కలు బాగా పెరిగేటట్లు నీటిని అందించాలని సూచించారు. అనంతరం అన్నక్యాంటీన్ ను సందర్శించారు. అక్కడ అందిస్తున్న ఆహారం పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శుచికి శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్ల ఔన్నత్యాన్ని మరింతగా పెంచే విధంగా సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.