BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం...

Select Suryaa Now
గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం...


: ధర్మాన రామ్మోనోహర్ నాయుడు..
 

శ్రీకాకుళం, నవంబర్ 16 మేజర్ న్యూస్:
శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుండ లక్ష్మీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అరసవిల్లిలో ఉదయం నిర్వహించిన ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుండ లక్ష్మీదేవిని మేయర్‌గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేయర్ అభ్యర్థితో పాటు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి బైరి షర్మిల సహా పార్టీ అభ్యర్థులందరికీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఘన విజయం అందించాలని కోరారు.

నామినేషన్ కార్యక్రమంలో గొండు కృష్ణమూర్తి, గుండ విశ్వనాథం, గుండ హరీష్, ముద్దాడ అసిరినాయుడు, జల్లు రాజీవ్, కునుకు మోహన్, అప్పు యాదవ్, సాయి, కింజరాపు రమేష్ తదితర నాయకులతో పాటు మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.