" ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ
విజయనగరం సూర్య: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా, సాహితీ స్రవంతి,జనవిజ్ఞాన వేదిక సంయుక్తంగా శ్రీమతి చీకటి చంద్రకా రాణి అధ్యక్షతన డాక్టర్.జి. వి. ఎస్.జయపాల రావు రచించిన" ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ సోమవారం సాయంకాలం గురజాడ కేంద్ర గ్రంథాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేదిక జిల్లా కార్యదర్శి పి.రమణ ప్రభాత్ ముఖ్య అతిథిగా వ్యవహరించారు. ఎగిరిపోమాకు పుస్తకాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.రేఖ కందుల ఆవిష్కరించారు. కరీంనగర్ కు చెందిన ప్రముఖ కవయిత్రి శ్రీమతి తోట నిర్మల రాణి పుస్తకాన్ని సమీక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ రమా గీతా దేవి, పుస్తకాన్ని సమీక్షించారు. శ్రీమతి గురజాడ ఇందిరా శ్రీమతి చల్లపల్లి శ్యామల ఆప్త వాక్యాన్ని కలిపారు. కవియిత్రి నిర్మలారాణి మాట్లాడుతూ " స్త్రీ మనసులోకి, జీవితంలోకి పరకాయ ప్రవేశం చేసి సగటు మహిళ ఆవేదనను ఆర్తిని అక్షరాల్లో ఒంపిన కవిత్వం జయపాల రావు ది, ప్రతి కవితలోనూ, కవిలోను సున్నితత్వం, మానవత్వము పదాలుగా పరిమిళిస్తుంది. ముఖ్యఅతిథిగా వ్యవహరించిన రమణ ప్రభాత్ మాట్లాడుతూ స్త్రీలు ఆధునిక సమాజంలో కూడా ఎన్నో సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకావిష్కర్త డాక్టర్. రేఖ మాట్లాడుతూ" వింగ్స్ ఆఫ్ ఫ్రీడం విత్ రూట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విల్ టేక్ ప్లేసెస్" అని చెప్పారు. సమీక్షకురాలు డాక్టర్ రమా గీతాదేవి మాట్లాడుతూ ఎగిరిపోతున్న కాలాన్ని దూరమవుతున్న జ్ఞాపకాలను అక్షరాల్లో పొదిలి పరచటం అందరితరము కాదు,అక్షరాలకు జీవం పోసే కవిత్వాన్ని ఎగిరిపోకుమా అనే ఒక పుస్తక శీర్షిక మిగిలిపోకుండా మనిషి తనలోని మానవత్వాన్ని,తన చుట్టూ ఉన్న అనుబంధాలను, తన జీవితంలో విలువలను కాపాడుకోవాలని, ఒక జీవన సందేశాన్ని ఈ కవితా సంకల్పం ద్వారా డాక్టర్ జి వి ఎస్ జైపాల్ రావు చక్కగా అందించారు.సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ పరిరక్షణ కార్యక్రమం జరిగింది.సాహిత్య అభిమానులు , కవులు,రచయితలు , అత్యధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.