BREAKING
ఘనంగా 365 వోత్తుల దీపారాధన షార్జా టెస్టులో ఉత్కంఠ.. ఓటమి అంచున అఫ్గానిస్థాన్.. విజయానికి జింబాబ్వే అడుగు దూరంలో! 48 బంతుల్లోనే 135 పరుగుల సునామీ.. 12 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రజత్ పాటిదార్! జాతీయ కవి సమ్మేళనంలో లింగాల నరసింగరావుకు అరుదైన గౌరవం పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల..

Select Suryaa Now
కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల..

 

శ్రీకాకుళం నవంబర్ 16 మేజర్ న్యూస్ :
సాహిత్య వేదికపై తన కవితా ప్రతిభతో యువ కవి నీలం గేదెల ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 177వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం ‘విజయనగర కవితా వైభవం’ కార్యక్రమంలో రాళ్లపాడు కాలనీకి చెందిన నీలం గేదెల తన కవితా పఠనంతో సభికులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ‘విజయనగర ఉత్సవం’ అనే శీర్షికతో వినిపించిన కవిత విజయనగర చారిత్రక వైభవాన్ని, తెలుగు భాషా సాహిత్య సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ శ్రోతల ప్రశంసలు అందుకుంది. యువ కవిలోని సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ ప్రతిభకు సభలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు.

అనంతరం శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఎం.ఈ.ఓ డబ్బీర్ గోవిందరావు, జాతీయ ప్రణాళికా కార్యదర్శి, రిటైర్డ్ డీఈఓ టీ. పార్థసారథి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంచాలకులు, శ్రీ శ్రీ కళా వేదిక కన్వీనర్ సముద్రాల గురు ప్రసాద్ తదితర ప్రముఖులు యువ కవి నీలం గేదెలను ఘనంగా సత్కరించారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేసి ఆయన సాహిత్య ప్రతిభను అభినందించారు.

యువతలో తెలుగు భాష పట్ల ఆసక్తిని, సాహిత్య అభిరుచిని పెంపొందిస్తూ కవితా రంగంలో నీలం గేదెల మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.