హీట్ పెంచిన దండుగోపాలపురం రాజకీయం
లబ్బా కుటుంబానికి ఏకగ్రివానికి సై అంటున్న ప్రతిపక్ష వర్గ0.
గ్రామంలో ఉండే మిగతా టిడిపి వర్గం నుంచి సమాధానం కోసం నిరీక్షణ
సంత బొమ్మాళి: దండుగోపాలపురం, నవంబర్ 16: మేజర్ న్యూస్
స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దండుగోపాలపురం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. లబ్బా కుటుంబం నిజాయితీగా, క్రమశిక్షణగా ఉంటూ, ఎ టువంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకుండా, ఒకే పార్టీ నీ నమ్ముకుని ఉండడం తో, ఎవరితో కూడా గొడవలు పడకుండా, నలుగురు కు పలు సేవలు చేస్తుంది. కావున ఆ కుటుంబానికి కుటుంబానికి అవకాశం కల్పిస్తే ఎన్నికను ఏకగ్రివం చేసేందుకు వైసిపి( ప్రతిపక్ష) ఇతర వర్గాలు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదే విషయాన్ని లబ్బ శ్రీనివాస్ టిడిపి మండల స్థాయి పెద్దలకు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
మంత్రి అచ్చన్న ఆఖరి మాట కోసం నిరీక్షణ.
ఈ మొత్తం రాజకీయంపై స్పష్టత రావాలంటే రాష్ట్ర మంత్రి అచ్చన్నాయుడు తుది నిర్ణయం లేదా ఆఖరి మాట ఎంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రి గ్రీన్‌సిగ్నల్ కోసం ఇరువర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మరోవైపు, ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు లబ్బా శ్రీనివాస్ పట్టు వదలని విక్రమార్కుడిలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ పట్టుదల ప్రయత్నాలు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి అచ్చన్న జోక్యంతో ఈ రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.