BREAKING
పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు.... కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల.. గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం... " ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ

మంత్రి అచ్చెన్నాయుడుతో ఎంపీటీసీల భేటీ

Select Suryaa Now
మంత్రి అచ్చెన్నాయుడుతో ఎంపీటీసీల భేటీ


సారవకోట నవంబర్ 16 మేజర్ న్యూస్ : సారవకోట మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండలానికి చెందిన ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు సోమవారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలను పరిశీలించి, మండల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు వెల్లడించారు.

మండలంలోని గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థానిక సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీటీసీలు పేర్కొన్నారు.