BREAKING
పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! మైదానంలో సంజూ శాంసన్ విశ్వరూపం.. 16 బంతుల్లోనే పరుగుల సునామీ.. మహారాష్ట్రపై కేరళ భారీ స్కోరు! పీఎం స్వన్నిధి అమలులో నగరపాలక సంస్థ కు అవార్డు... ఆయుర్వేద వైద్యంతో నిండైన ఆరోగ్యం కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి! ఎల్.కోటలో జోరుగా నామినేషన్లు.. మేజర్ పంచాయతీలో నువ్వా నేనా! ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి ఖాసాపేట సర్పంచ్ అభ్యర్థిగా కోళ్ల హసీతా నాయుడు నామినేషన్ దాఖలు దుకాణాల అద్దె బకాయులు తక్షణమే చెల్లించాలి.. సంగాం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పారిశుద్ధ్య నిర్వహణ లో నిర్లక్ష్యం తగదు.... కవితా పఠనంతో సభను అలరించిన యువ కవి.. నీలం గేదెల.. గుండ లక్ష్మీదేవి గెలుపే లక్ష్యం... " ఎగిరిపోమాకు" పుస్తకావిష్కరణ

భారీ వర్షాల హెచ్చరిక.. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి..

Select Suryaa Now
భారీ వర్షాల హెచ్చరిక.. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి..


: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, నవంబర్ 16 మేజర్ న్యూస్: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆయన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఒడిశాలో వర్షాలు కురిస్తే జిల్లాలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని, నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిరోజూ సాయంత్రం చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించాలన్నారు. ఇసుక బస్తాలు, గమేళాలు, జేసీబీలు, ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

పునరావాస కేంద్రాలు, కంట్రోల్ రూములలో సిబ్బంది కొరత లేకుండా ఇతర శాఖల వారిని వినియోగించుకోవాలని, ప్రభుత్వ నిల్వల నుంచే నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. టార్చ్‌లైట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లతో కూడిన కిట్లను తహసీల్దార్ కార్యాలయాల్లో ఉంచాలని, 11 మండలాల్లోని మత్స్యశాఖ బోట్లను అవసరమైన చోట సిద్ధం చేయాలన్నారు. రహదారులపై విరిగిపడే చెట్లను వెంటనే తొలగించేందుకు ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖలు సిద్ధంగా ఉండాలని, కల్వర్టులు, కాజ్‌వేలను శుభ్రం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా జనరేటర్లు సిద్ధం చేయాలని, ఉద్దానం పథకం నీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టం చేశారు.

గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆసుపత్రులు, సంక్షేమ వసతి గృహాల్లో మందులు, ఇన్వర్టర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు తహసీల్దార్ల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, మత్స్యశాఖ డిడి టి. సుమలత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సూర్యప్రకాష్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్, సీపీవో లక్ష్మీప్రసన్న, విపత్తు నిర్వహణ జేడీ రాము, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈలు సత్యనారాయణ, సుధాకర్, పి. శంకరబాబు, డీఈవో ఎ. రవిబాబు తదితరులు పాల్గొన్నారు.